Quora ఎందుకు ఉంది

ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్ని పంచుకోవడం, అభివృద్ధిపరచడమే Quora లక్ష్యం. ఎందరికో ఎంతో విలువైన ఎంతో విజ్ఞానం ప్రస్తుతం కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉంది — ఇది వ్యక్తుల మేధస్సులో బందీ అయి ఉండడం కానీ, కొద్దిమంది ఎంపికచేసిన సమూహాలకే అందుబాటులో ఉండడం కానీ జరుగుతోంది. విజ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తులను, ఆ విజ్ఞానం అవసరమైన వ్యక్తులతో కలపాలని, విభిన్న దృక్పథాలు గల వ్యక్తులను ఒకచోటికి చేర్చి వారు పరస్పరం మరింత బాగా అర్థంచేసుకోవడానికి వీలుకల్పించాలని, అలాగే ప్రపంచంలోని ఇతరుల ప్రయోజనార్థం తమ విజ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రతిఒక్కరికీ సాధికారత కల్పించాలని మేం ఆశిస్తున్నాం.

ప్రశ్న వివరాలను సేకరించండి

Quora హృదయమే ప్రశ్నలు — ప్రపంచంపై ప్రభావం చూపే ప్రశ్నలు, ప్రపంచంలో ఇటీవల జరిగిన సంఘటనలను వివరించే ప్రశ్నలు, జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మార్గనిర్దేశం చేసే ప్రశ్నలు, అలాగే ఇతరులు ఎందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నారనే దానికి సంబంధించిన లోచూపును అందించే ప్రశ్నలు. Quora అనేది మీకు అత్యంత ఆసక్తి గల ప్రశ్నలను అడిగి, వాటికి అద్భుతమైన సమాధానాలను పొందగల వేదిక.

Quoraలో ప్రతి ప్రశ్నకు ఒక వెర్షన్ మాత్రమే ఉంటుంది. దీనికి వామపక్షపు వెర్షన్, సంప్రదాయవాద/దక్షిణపక్షపు వెర్షన్, పాశ్చాత్య వెర్షన్ లేదా ప్రాచ్య వెర్షన్ ఉండవు. Quora వివిధ ప్రపంచాలకు చెందిన వ్యక్తులను ఒకదగ్గర చేర్చి, ఒకే ప్రశ్నకు, ఒకే చోట సమాధానమిచ్చేలా చేసి, ఒకరి నుంచి మరొకరు నేర్చుకునే వీలు కల్పిస్తుంది. Quora అన్నది చర్చ జరిగే చోటు కనుక మీ అభిప్రాయాన్ని వినిపించే వేదికగా Quora ఉండాలని మేము కోరుకుంటున్నాము. Quora సమాధానం ప్రతిఒక్కరికీ ఎప్పటికీ స్పష్టమైన, నిశ్చయమైన సమాధానంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము.

ప్రపంచాన్ని, అందులోని వ్యక్తులను అర్థం చేసుకోండి

చదివినందుకు మీకు మంచి అనుభూతి కలిగించే కంటెంట్ Quoraలో ఉంది. ప్రపంచం ఎందుకు ఇలా పనిచేస్తుంది, ప్రజలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, అలాగే ప్రపంచాన్ని మెరుగుపరచడానికి మనమందరం ఏమి చేయగలమనే అంశాలను అర్థం చేసుకోవడంలో Quora మీకు సహాయపడుతుంది. మీరు అడగాలని మీకు తోచని ప్రశ్నలకు లోచూపుతో కూడిన సమాధానాలతో వ్యక్తిగతీకరించిన ఫీడ్‌ను Quora అందిస్తుంది.

Quora సమాధానాలు ఆయా అంశాలపై నిజమైన అవగాహనను, మౌలికమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవారి నుంచి వస్తాయి. Quora అనేది ఇరాన్ ఒప్పందంపై బరాక్ ఒబామా, జైలులో జీవితం గురించి ఖైదీలు, గ్లోబల్ వార్మింగ్‌పై శాస్త్రవేత్తలు, దోపిడీ దొంగలను అడ్డుకోవడంపై పోలీసు అధికారులు, అలాగే తమ కార్యక్రమాలను తెరకెక్కించే విధానంపై టీవీ నిర్మాతలు సమాధానాలిచ్చే చోటు. Quora అనేది స్ఫూర్తిదాయక వ్యక్తులైన గ్లోరియా స్టీనెమ్, స్టీఫెన్ ఫ్రై, హిల్లరీ క్లింటన్, గ్లెన్ బెక్, షెరిల్ శాండ్ బర్గ్, వినోద్ ఖోస్లా, అలాగే గిలియన్ యాండర్సన్ వంటివారు నేరుగా ఎక్కువమంది సమాధానం కోరుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే చోటు. Quora అన్నది మీరు వేరే మార్గంలోనూ ఎన్నటికీ చేరుకోలేని వ్యక్తులు, ఎన్నడూ ఎక్కడా పంచుకోనటువంటి ముఖ్యమైన లోచూపులను చదవగలిగే చోటు.